భూమండలాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనడంలోనే ప్రపంచ శాస్తవేత్తలంతా నిమగ్నమయ్యారు. పక్కనున్నవారికి కూడా తెలియకుండాసాగే ప్రక్రియ ‘పరిశోధన’. కానీ కరోనాను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు అంతర్జాతీయంగా పరిశోధన ఫలితాలను పంచుకొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు అంచనా. ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ దాదాపు ఒకే అంశంపై పరిశోధన సాగించడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారికావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైరస్‌ను అడ్డుకోవచ్చని భావిస్తున్న రెండురకాల టీకాలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కొరోఫ్లూ పేరుతో వ్యాక్సిన్ తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నది. అమెరికాలోని పిట్స్‌బర్గ్ పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్, ఆస్ట్రియన్ డ్రగ్ కంపెనీ థెమిస్ బయోసైన్స్ కూడా వ్యాక్సిన్ తయారీప్రయత్నంలో ముందున్నాయి.
వ్యాక్సిన్‌పై ముందడుగు!