తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి దీటుగా వంతెనల నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. గత ఆరు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని వివిధ వాగులు, వంకలపై రూ.2,797 కోట్ల వ్యయంతో 414 వంతెనల నిర్మాణం చేపట్టగా అందులో రూ.1,700 కోట్ల వ్యయంతో 256 వంతెనలు ఈ సరికే పూర్తయ్యాయి. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సంగతి వెల్లడించారు. రూ.11,257 కోట్ల అంచనా వ్యయంతో 7,554 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు ఆయన తెలిపారు. రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణకు రూ.3,146 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.1,868 కోట్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. గత ఆరేళ్లలో మొత్తంగా రూ.16,800 కోట్లతో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయగా అందులో రూ.10,800 కోట్ల మేర రోజ్ల నిర్మాణం, మరమ్మత్తుల పనులు పూర్తయ్యాయని మంత్రి వివరంచారు.
రెండు వేల కోట్లతో 414 వంతెనలు నిర్మాణం